![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -449 లో... ధీరజ్ కి నిజం తెలిసి భాగ్యం వాళ్ళతో ఒక ఆట ఆడుకోవాలని అనుకుంటాడు. కేరళ వైద్యం అంటూ ఒక కర్రతో భాగ్యం కాళ్లపై కొట్టమని నర్మదకి ఇస్తాడు. ఆ తర్వాత శ్రీవల్లి వదిన అయితే బాగా కొడుతుంది.. దెబ్బకి వాళ్ళ అమ్మలేచి నడుస్తుందని ధీరజ్ అంటాడు.
ఇక తప్పక శ్రీవల్లి వాళ్ళ అమ్మ కాళ్లపై కర్రతో కొడుతుంది. ఆడవాళ్ళని కొట్టవద్దన్న సంస్కారం మా నాన్న నేర్పించాడు.. అందుకే ఏం అనలేదు మిమ్మల్ని అంత బాగా చూసుకుంటున్న కుటుంబాన్ని మోసం చేయడానికి మీకు సిగ్గులేదా వదిన అని ధీరజ్ అనగానే భాగ్యం వాళ్ళు షాక్ అవుతారు.
ఆ తర్వాత ప్రేమ ఇంటికి వచ్చాక పడుకుంటుంది. ధీరజ్ తనని చూస్తూ ఉంటాడు. ప్రేమ ఇచ్చిన గిఫ్ట్ పగులగొట్టింది ధీరజ్ గుర్తుచేసుకొని ఆ గిఫ్ట్ తీసుకొని వచ్చి పగిలిన గిఫ్ట్ ని అతికించి ప్రేమకి సర్ ప్రైజ్ ఇస్తాడు. దాంతో ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ధీరజ్ తనని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు.
మరొకవైపు డబ్బులు అప్పు ఇచ్చిన సేట్ నర్మదకి ఫోన్ చేసి మీ ఆయనకి ఎంత పొగరు ఉంది. నా దగ్గరికి వచ్చి కోపంగా వడ్డీ డబ్బులు విసిరేసాడు. మీరు నాకు నెల రోజులలోగా మొత్తం డబ్బులు నాకు ఇచ్చేయాలని సేట్ చెప్పగానే కొంచెం టైం ఇవ్వండి అని నర్మద రిక్వెస్ట్ చేస్తుంది. అయినా సేట్ వినిపించుకోడు.
మరొకవైపు ప్రేమని ఎందుకో యాక్సిడెంట్ కావాలని చేశారని ప్రేమ భయపడుతుంది. ఈ విషయాలు గురించి కనుక్కోమని తన ఫ్రెండ్స్ కి ధీరజ్ చెప్తాడు. ఆక్సిడెంట్ చేసింది ఇతనే అని రౌడీ ఫోటో చూపిస్తాడు. మరొకవైపు నిన్ను ఎవరు చూడలేదు కదా నీ కోసం ఎవరు రాలేదు కదా.. జాగ్రత్తగా ఉండమని రౌడీకి సేనాపతి చెప్తాడు.
ఆ తర్వాత SI రిజల్ట్స్ వస్తాయి. అందులో ప్రేమ ఫెయిల్ అవుతుంది. ఆ రిజల్ట్స్ చూసి ధీరజ్ షాక్ అవుతాడు. నీ సంగతి చెప్తానే అని ధీరజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |